- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీతో కేంద్రం పేదల రక్తం తాగింది: మంత్రి పొన్నం ప్రభాకర్
జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని, శవ పేటికలపై, పసి పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండి పడ్డారు. జీఎస్టీ తగ్గించిన కేంద్రం మీ చావు మీరు చావండి అన్న విధంగా వ్యవహరిస్తోందని, సంక్షేమం మొత్తం రాష్ట్రాల మీద రుద్దుతున్నారని ఆయన విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని, శవ పేటికలపై, పసి పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండి పడ్డారు. జీఎస్టీ తగ్గించిన కేంద్రం మీ చావు మీరు చావండి అన్న విధంగా వ్యవహరిస్తోందని, సంక్షేమం మొత్తం రాష్ట్రాల మీద రుద్దుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు 7 వేల కోట్ల నష్టం వస్తోందని, దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదే అని మంత్రి పొన్నం అన్నారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్ ల పేరుతో దండుకుంటున్నారని, జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు పది సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుందని చెప్పినా పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదన్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్న 7 వేల కోట్ల రూపాయల పై మాకు ఎంత ఇస్తారు ప్రామిస్ చేయాలలని, రాష్ట్రాలు నష్టపోతున్న దానిపై తెలంగాణలోని కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ మొదటి నుండి ఇది జీఎస్టీ కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్తున్నారని, పేదలను దోచుకోవడానికి జీఎస్టీ తెచ్చారని, దీనితో ఏదైనా మంచిపని చేశారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. జీఎస్టీ తెచ్చిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్నారని, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రజల రక్తం పీల్చుకు తిన్నట్టే కదా అని ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ లో చేర్చాలని తద్వారా పన్ను రేటు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, ఇప్పటి వరకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తేలేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ను ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్డిమాండ్చేశారు.
ల్యాండ్ క్రూజర్ వాహనాల వివాదంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ల్యాండ్ క్రూజర్ వాహనాలపై జరుగుతున్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ల్యాండ్ క్రూజర్ వాహనాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కు పొన్నం ప్రభాకర్ సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటికే గత ప్రభుత్వం ల్యాండ్ క్రూజార్స్ ఉన్నాయని, మేం వచ్చాక వాటిని కొనలేదన్నారు. గత వాహనాలపై దర్యాప్తు చేస్తామని, ఏదైనా అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.






