Ponnam Prabhakar: కేసీఆర్ త్వరగా కోలుకొని తిరిగి రావాలి: మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Ponnam Prabhakar: కేసీఆర్ త్వరగా కోలుకొని తిరిగి రావాలి: మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR health) స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఆయన చేరారు. రక్తంలో షుగర్ లెవల్ అధికంగా ఉండటం, సోడియం లెవల్ తక్కువగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన నీరసంతో బాధపడుతున్నట్లు హస్పటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కొలుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారన్న వార్త కలచివేసింది. ఆయన త్వరగా కోలుకొని పూర్తిస్థాయి ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ మంత్రి ట్వీట్ చేశారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యంపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story