- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బీరు, బిర్యానీ అలవాటు చేసిందే కేటీఆర్’.. పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రాపై, ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే ప్రజలను బీరు, బిర్యానీలకు అలవాటు చేసిందే కేటీఆర్ అని మండిపడ్డారు. మాగంటి గోపీనాథ్‌పై అంత ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే కేటీఆర్ వస్తారు.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. అంతకుముందు సంచార జాతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంచార జాతులపై సర్వే జరుగుతుందని, సర్వే ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి తరాన్ని నిర్మించడానికి విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సంచార జాతులు ఉద్యోగాలు పొందాలని, మన జాతి బిడ్డలకు మంచి చదువులు, నైపుణ్యాలు అందించాలన్నారు.






