పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. బీసీ రిజర్వేషన్ల కేసు విచారణపై మంత్రి పొన్నం సూచనలు

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మంత్ర పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. బీసీ రిజర్వేషన్ల కేసు విచారణపై మంత్రి పొన్నం సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC reservation) అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మంత్ర పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఒక వీడియో తన ఎక్స్ ఖాతా వేదికగా విడుదల చేశారు. పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నష్టం కలిగించేది కాదని సూచించారు. బలహీన వర్గాలకు చేయూతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో రాహుల్‌గాంధీ ఆలోచన ప్రక్రియలో రిజర్వేషన్లు ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరుతో చేస్తున్నప్పటికీ అందరికీ సంబంధం అనే మాట కాదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు పెద్దలంతా సపోర్ట్‌గా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న హక్కు మాదిరి బీసీలకు కూడా హక్కు ఉండాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకాభిప్రాయంతో ఈ బిల్లు ముందుకు పోయిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు న్యాయ స్థానాల్లో రాజకీయ పార్టీల మద్దతే ప్రజల మద్దతు అని చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, టీపీసీసీ ,ఏఐసీసీ ఇన్చార్జి సూచనల మేరకు తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీ వెళ్తున్నామని అన్నారు. అక్కడ సీనియర్ న్యాయావాదులను కలుస్తామని చెప్పారు. బలహీన వర్గాల సామాజిక న్యాయానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. మంత్రి ట్వీట్..

Next Story