- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ASEZ ప్లాస్టిక్ రహిత భారత్ కోసం గ్రీన్ సంగీత కచేరి.. ప్రారంభించిన మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సౌత్ కొరియా బృందం ఏసెజ్ ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం గ్రీన్ సంగీత కచేరీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ‘ఏసెజ్ ప్లాస్టిక్ నిర్మూలిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే మద్దతు పత్రంపై సంతకం చేసి సౌత్ కొరియా బృందం పాడిన గ్రీన్ కచేరీని ఆయన వీక్షించించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ASEZ అంటే ‘ సేవ్ ది ఎర్త్ ఫ్రమ్ ఏ టు జడ్’ భూమిని ప్రతి కోణంలోనూ రక్షించడం అనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్న గ్లోబల్ వాలంటీర్ ఉద్యమానికి అభినందనలు తెలిపారు. సౌత్ కొరియా నుంచి వచ్చి గ్రీన్ కచేరీ ద్వారా ‘పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ ను నిర్మూలించాలి’ అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హుస్నాబాద్ ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దామని అన్నారు. 172 గ్రామాల్లో 282 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని కీలక వ్యాఖ్యలు చేశారు. 13 రకాల స్టీల్ వస్తువులు ఒక్కో యూనిట్ లో 500 ,400,300 కిట్స్ పంపిణీ చేశామని వివరించారు. ప్లాస్టిక్ ప్లేట్ లో అన్నం తినడం వల్ల క్యాన్సర్ సంబంధిత వ్యాధులు సంభవిస్తుంటాయని తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించే కార్యక్రమాలు..
సెక్రటేరియట్ ఉద్యోగులు సమాజంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. సెక్రటేరియట్ క్యాంటీన్ లో ప్లాస్టిక్ నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ASEZ ప్రపంచంలోని అనేక దేశాల్లో యువతను కలుపుకుని పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు, శుభ్రత కార్యక్రమాలు, ప్లాస్టిక్ వినియోగం తగ్గించే కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. సంగీతం ద్వారా సామాజిక సందేశాన్ని ప్రజల మనసులకు చేరవేయడం చాలా ప్రభావవంతమైన మార్గమని, ఈ సంగీత కచేరీ కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
పరిశుభ్రత, ప్లాస్టిక్ తగ్గింపు, పచ్చదనం పెంపు వంటి అంశాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఈ దిశగా ఏసెజ్ వాలంటీర్లు చేస్తున్న సేవ నిజంగా ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, బాధ్యతాయుతమైన జీవనశైలిని అవలంబించాలనే సందేశం సమాజానికి చేరుతోందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరగాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, వాలంటీర్లు, అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మనందరం కలిసి ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన సమాజం నిర్మించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.






