SDPT: యువకుల గల్లంతు ఘటన.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌(Kondapochamma Reservoir)లో యువకులు గల్లంతు అయిన ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు.

SDPT: యువకుల గల్లంతు ఘటన.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌(Kondapochamma Reservoir)లో యువకులు గల్లంతు అయిన ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు. సిద్దిపేట కలెక్టర్‌ మను చౌదరి(Collector Manu Chaudhary)తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఇకపై ప్రాజెక్ట్‌ వద్ద ఎవరూ ఈతకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పొన్నం ఆదేశించారు. రిజర్వాయర్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. ఈత కొడుతూ రిజర్వాయర్‌లో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా వారంతా డ్యామ్‌లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడగలిగారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story