గల్ఫ్ దేశాల్లో యుద్ధం: మంత్రి పొన్నం కీలక మెసేజ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-01 10:51:42  IST  )

గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతున్న వేళ కేంద్రం ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు.

గల్ఫ్ దేశాల్లో యుద్ధం: మంత్రి పొన్నం కీలక మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతున్న వేళ కేంద్రం ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కీలక విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్రం చూడాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో చాలా మంది తెలంగాణ వాళ్లు ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రజలు క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర సహకారంతో రాష్ట్ర ప్రజలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏసీ స్పీకర్ మెసేజ్..

మరోవైపు.. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది వరకు బహ్రెయిన్‌లో వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లారు. ఎన్నారై శెట్టి సతీశ్కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా ఫోన్ చేసి, అక్కడి తెలుగువారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎటువంటి ఆపద వచ్చినా ఏపీఎన్ఆర్టీ (APNRT) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు.

Next Story