- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ
అసెంబ్లీలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) లేఖ రాశారు. రేపు గవర్నర్ వద్దకు రావాలని ఆహ్వానించారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) లేఖ రాశారు. రేపు గవర్నర్ వద్దకు రావాలని ఆహ్వానించారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు రాసిన లేఖను మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి అందించారు. రేపు గవర్నర్ వద్దకు తప్పకుండా రావాలని ఆహ్వానించారు. ఇదిలా ఉంటే.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదముద్ర పడింది. బీసీ బిల్లుతోపాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.






