- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సద్దుల బతుకమ్మ, దసరా స్పెషల్.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
టీజీ ఆర్టీసీ ఉన్నతాధికారుల(RTC Official)తో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: టీజీ ఆర్టీసీ ఉన్నతాధికారుల(RTC Official)తో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి బస్ స్టేషన్‌లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, అక్కడ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ.. 97 డిపోలు 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు.
దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ శనివారం నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని అధికారులు మంత్రికి వివరించారు.






