- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాముడి ప్రాణప్రతిష్ట మోడీ చేయడాన్ని పీఠాధిపతులే వ్యతిరేకిస్తున్నారు: మంత్రి
by GSrikanth |
అయోధ్య రామమందిరంలో రాముడి ప్రాణపత్రిష్టను బీజేపీ రాయకీయంగా వాడుకుంటోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరంలో రాముడి ప్రాణపత్రిష్టను బీజేపీ రాయకీయంగా వాడుకుంటోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు అందరివాడు అని వ్యాఖ్యానించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీ ఇకనైనా మారాలని హితవు పలికారు. రామమందిరంలో ప్రధాని మోడీ ప్రాణప్రతిష్ట చేయడానికి పిఠాధిపతులే వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాములవారి అక్షింతల పేరుతో బియ్యం సంచులు పంపిణీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ గెలుస్తామో.. తిరుగుబాటు వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ నేతలు అహంకారంగానే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించొద్దని కోర్టులో పిల్ వేశారని గుర్తుచేశారు.
Next Story






