- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: ఏడాది పాలనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక వీడియో ద్వారా సందేశం తెలిపారు. నేటికి ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా , ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహచర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తలు సంతృప్తిగా ప్రజాసేవ చేశామన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
రూ. 2 లక్షలు రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు ఏడాది కాలంలో 55 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. గురుకులాల్లో 40 శాతం కాస్మొటిక్ అండ్ డైట్ చార్జీలు పెంచామన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్ నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని, ప్రజలు మరింత సహకరించాలని కోరారు.






