- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాలక్ష్మి పథకం వల్లే ఆర్టీసీ బతికింది.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
టీజీ ఆర్టీసీ(TG RTC)పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీజీ ఆర్టీసీ(TG RTC)పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రజా భవన్‌లో ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూప్‌లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో మహిళలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. చేతి గుర్తుకు ఓటేసినందుకు చెయ్యెత్తితే చాలు బస్సు ఆపుతున్నారు.. తాము సగౌరవంగా బస్సెక్కుతున్నామని మహిళలు చెబుతున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం.. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ మరోసారి బతికిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే దాదాపు రూ.200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన రికార్డు నమోదు కాబోతుందని చెప్పారు. రూ.6500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం నమోదు కాబోతుంది.. ఈ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని అన్నారు. ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం కోసం డ్రైవర్లు, కండక్టర్‌లు చాలా కష్టపడుతున్నారని కొనియాడారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం.. కొత్త నియామకాలు చేస్తున్నాం.. మహిళలకు ఎక్కడికిపోవాలన్న ఆర్టీసీ ఉచిత బస్సును వాడుకుంటున్నారు.. ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి పోతుందని అన్నారు.






