Ponnam Prabhakar: పంచాయతీ ఎన్నికలపై ఆ అనుమానం వద్దు: పొన్నం ప్రభాకర్

by Prasad Jukanti |   (  Updated:2025-06-17 11:10:29  IST  )

పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponnam Prabhakar:  పంచాయతీ ఎన్నికలపై ఆ అనుమానం వద్దు: పొన్నం ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై (Local body elections) కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో ఉన్నదని ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో సామాజిక కార్యకర్త కంచె ఐలయ్య (Kanche Ilaiah) సోదరుడు సైన్స్ మనిషి కంచె కట్టయ్య సంస్మరణ సభలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచె కట్టయ్య చిత్రపటానికి మంత్రి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులగణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపామని అందువల్లే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అధికార పక్షం నుంచి రకరకాల ప్రకటనలు రావడంపై పీసీసీ చీఫ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Next Story