- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైతులకు మంత్రి పొన్నం కీలక హామీ
by GSrikanth |
ఆరు గ్యారంటీల అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. సూర్యాపేట వరకు సాగు నీటినిస్తామని, రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలన్నారు. ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2023లో ప్రజలు మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని.. 2024లో ప్రజలు కోరుకుంటున్నా పరిపాలనను అందిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా ముందుకు పోతామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
Next Story






