ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి అలర్ట్.. ఇంట్లో ఆ చెట్లు ఉండాల్సిందే: మంత్రి పొన్నం

by Gantepaka Srikanth |

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించారు.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి అలర్ట్.. ఇంట్లో ఆ చెట్లు ఉండాల్సిందే: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులు(Ration Cards) పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి.. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పెళ్లి అయినా.. పిల్లలు పుట్టినా.. కొత్త పేర్లు కూడా చేర్చే అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అంతేగాకుండా.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma illu) కట్టుకునే వారికి మహిళా సంఘం నుంచి రూ. లక్ష రుణం ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ప్లాస్టిక్ వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే అందరూ.. ఇంట్లో నిమ్మ, జామ, మునగ, కరివేపాకు చెట్లు పెంచుకోవాలని సూచించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story