ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన

by Gantepaka Srikanth |

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక సూచనలు చేశారు.

ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక సూచనలు చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ(Telangana Secretariat) సంఘం ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram)తో కలిసి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఫైల్స్ విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం, ఆలస్యం చేయకుండా ఉండటంతో పాటు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.

ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సచివాలయం సంఘం ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ J.ప్రేమ్ (దేవేందర్ ), ట్రెసరర్ V. కైలాష్, వైస్ ప్రెసిడెంట్ M. నవీన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ (విమెన్) అయేషా తబస్సుమ్, జాయింట్ సెక్రటరీ (విమెన్) నీరాజక్షి, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజషన్) K. శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ (కల్చరల్) యామిని కనకతారా, జాయింట్ సెక్రటరీ ( స్పోర్ట్స్) వంశీధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ (పబ్లిసిటీ ) రాజేశ్వర్ మరియు వివిధ శాఖల ప్రతినిధులు (DRs), ఉద్యోగులు పాల్గొన్నారు.




Next Story