- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: ఇండ్ల నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల నియామక పత్రాలు అందజేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం(Indiramma Housing Scheme)లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల నియామక పత్రాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఒక వీడియో విడుదల చేశారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల రూపాయలు సహాయం చేస్తోందని అన్నారు. (House construction) ఇళ్ల నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తోందని తెలిపారు.
ఇల్లు నిర్మాణాన్ని 400- 600 చదరపు అడుగులు లోపే ఇల్లు నిర్మించాలని సూచించారు. ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే మహిళా సంఘాల నుంచి మీకు లక్ష రూపాయల రుణం అందిస్తుందని స్పష్టం చేశారు. పది సంవత్సరాల తర్వాత ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.






