- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఎప్పుడూ గౌరవమే: మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నికల్లో ఓడిపోతున్నామన్న అసహనంతో బీఆర్ఎస్ అభ్యర్థి మూడు రోజులుగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నికల్లో ఓడిపోతున్నామన్న అసహనంతో బీఆర్ఎస్ అభ్యర్థి మూడు రోజులుగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ అభ్యర్థిని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం పొన్నం ప్రభాకర్మీడియాతో మాట్లాడుతూ తల్లి మీకు దండం పెట్టుకుంటున్నాం.. ఎన్నికల్లో మీరు పోటీ చేసినారు.. మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించారా? లేదా? అనే అంశం పక్కన పెట్టి.. మా అభ్యర్థి విజయం కోసం మా పార్టీ నాయకత్వం అంతా కలిసి పని చేశామన్నారు. ఏ పార్టీ నాయకులైనా వారు స్థానికేతరులైతే ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎవరు కూడా ఎక్కడ నియోజకవర్గంలో కనబడడానికి వీలులేదని, ఈసీ తమ కార్యాచరణ ప్రకారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏ పార్టీ అయినా కేసులు పెట్టుకోవచ్చన్నారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందాలనే ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు.






