Ponnam Prabhakar: కులగణనతో బీజేపీకి ఏం సంబంధం?: పొన్నం

by Prasad Jukanti |

కులగణనపై కులసంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Ponnam Prabhakar: కులగణనతో బీజేపీకి ఏం సంబంధం?: పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ కులగణన ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కులగణనపై (Caste Census) కుల సంఘాల నేతలకు వివరిస్తామని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ లో ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఆయన.. సర్వే నివేదికపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ (BRS) నేతలు సర్వేలో పాల్గొనలేదు. కానీ అవహేళన మాత్రం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేలో పాల్గొనని వారికి కులగణనపై మాట్లాడే అవకాశం లేదన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉరుకుంటామా అని ప్రశ్నించారు. కులగణన చేయబోమని కేంద్రంలో బీజేపీ అఫిడవిట్ ఇచ్చింది. కులగణనతో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీజేపీ (BJP) ఫ్యూడలిస్టిక్ పార్టీ అని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలనే డిమాండ్ ఉంది. కానీ ఇప్పటివరకు చేయలేదు. కానీ మా ప్రభుత్వం కులగణన ప్రక్రియను పక్కాగా పుర్తి చేసిందన్నారు. బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

Next Story