కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విదేశీయులకు ‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ రద్దు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-05 05:37:43  IST  )

భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపునిచ్చింది.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విదేశీయులకు ‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక మార్కెట్లలోకి మరిన్ని విదేశీ నిధులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టే పెట్టుబడులపై వచ్చే మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేస్తున్నట్లుగా కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయ బాండ్ మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, రూపాయి విలువను స్థిరీకరించడంలో కేంద్ర తీసుకున్న తీసుకున్న తాజా నిర్ణయం గేమ్ ఛేంజర్ కానుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు‌తో ప్రయోజనాలివే..

మూలధన లాభాల పన్ను మినహాయింపు కారణంగా రాబోయే రోజుల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ పెట్టుబడులు భారత డెట్ మార్కెట్ (Debt Market) లోకి రానున్నాయి. దేశంలోకి విదేశీ మారక ద్రవ్యం (Foreign Exchange) పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత బలోపేతం అవుతుంది. బాండ్లకు డిమాండ్ పెరగడం వల్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ (Bond Yields) తగ్గి, ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు సేకరించేందుకు వీలు అవుతుంది.

Next Story