గ్రానైట్ క్వారీలలో అక్రమాలపై CID విచారణ

by Jakkula.Mamatha |

కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్‌లో రికార్డులు సేకరించారు.

గ్రానైట్ క్వారీలలో అక్రమాలపై CID విచారణ
X

దిశ, కొత్తపల్లి: కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్‌లో రికార్డులు సేకరించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ మీటింగ్‌లో కూడా నిర్ణయం తీసుకుని విచారణ బాధ్యతలు CIDకి అప్పగించింది ప్రభుత్వం. 2014 నుండి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మైనింగ్ జరుగుతున్న జిల్లాల్లో విచారణ జరిపేందుకు CID విచారణ చేపడుతుంది. ఇందులో భాగంగా కరీంనగర్ మైనింగ్ ఏడీ కార్యాలయంలో CID అధికారులు జిల్లాలోని మైన్స్ వివరాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జరిగిన మైనింగ్ అక్రమాలపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఈ మేరకు గతంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సైతం మాట్లాడారు. క్వారీల లీజుల బదిలీలు, గ్రానైట్ సీనరేజ్ పన్ను ఎగవేత, అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలు, లీజు తీసుకున్న మేరకే తవ్వకాలు జరిపారా, పదేళ్లలో గ్రానైట్ క్వారీల నుండి రవాణా అయిన మెటీరియల్ వివరాలను సమగ్రంగా తెలుసుకోనున్నట్టు సమాచారం.

కరీంనగర్ జిల్లాలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఆరా తీయనున్నట్టుగా సమాచారం. గ్రానైట్ రవాణాకు సీనరేజ్ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉందా.. అనే వివరాలు కూడా తెలుసుకునేందుకు, రైల్వే విభాగం, విదేశాలకు తరలి వెళ్లిన గ్రానైట్ ఏ ఏ పోర్టుల నుంచి వెళ్ళింది..? ఆయా పోర్టులకు ఎంతమేర రవాణా ఛార్జీలు చెల్లించారు..? వాటి పరిమాణం ఎంత తదితర వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిన రాయల్టీ ఎంత వచ్చిందో కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వాటిల్లిందో తేల్చనున్నట్టుగా సమాచారం. కొన్ని ప్రాంతాల్లో క్వారీలను కూడా CID అధికారుల బృందాలు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. అన్ని ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆయా క్వారీల ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి సారించనున్నట్టు సమాచారం.

అక్రమార్కుల గుండెల్లో సిఐడి భయం..

గ్రానైట్ ఎగుమతులు తమ కాళ్ళకు సంబంధించి సిఐడి విచారణ చేపట్టింది.. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన క్వారీ నిర్వాహకులు ట్రాన్స్‌పోర్ట్ యజమానులు గుండెల్లో ఒకసారిగా భయం పుట్టింది అని చెప్పవచ్చు.. ఎగుమతులు మరియు తవ్వకాల రికార్డులు సిఐడి క్షుణ్ణంగా పరిశీలించడంతో అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Next Story