ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘అగ్లీ స్టోరీ’

by Pulgam srinivas |

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రం తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘అగ్లీ స్టోరీ’
X

దిశ, వెబ్ డెస్క్: నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ‘అగ్లీ స్టోరీ’ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకోగా, ఈరోజు నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో ఎలాంటి స్పందనను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం తదితరులు కీలక పాత్రలు పోషించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Next Story