మెడికల్ కోడింగ్ కంపెనీ పేరుతో నిరుద్యోగ యువతకు టోకరా

by Ajay Maddhiboyina |

ఈ మ‌ధ్య ఉద్యోగాల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు దొరక్కపోవ‌డంతో యువ‌త అవ‌స‌రాన్ని కొంద‌రు మోస‌గాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఏపీలోని నంద్యాల‌లో చోటు చేసుకుంది.

మెడికల్ కోడింగ్ కంపెనీ పేరుతో నిరుద్యోగ యువతకు టోకరా
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య ఉద్యోగాల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు దొరక్కపోవ‌డంతో యువ‌త అవ‌స‌రాన్ని కొంద‌రు మోస‌గాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఏపీలోని నంద్యాల‌లో చోటు చేసుకుంది. నంద్యాల‌లో మెడిక‌ల్ కోడింగ్ కంపెనీతో యువ‌త‌ను మోసం చేశారు. ఉద్యోగాల పేరుతో య‌వతీ, యువ‌కుల వ‌ద్ద కోట్ల రూపాయ‌లు వ‌సూళు చేసి ఆ త‌ర‌వాత బోర్డు తిప్పేశారు. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన దాదాపు 700 మంది వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. మూడు నెల‌లు కంపెనీలో ఉద్యోగం చేయించుకుని జీతాలు ఇచ్చి, త‌ర‌వాత ఏడు నెల‌లు జీతాలు ఇవ్వ‌కుండా తిప్పించుకున్నారు. త‌మ వ‌ద్ద నుండి ఒక్కొక్కరి వ‌ద్ద ల‌క్ష రూపాయ‌లు వ‌సూలు చేశార‌ని బాధితులు చెబుతున్నారు. కంపెనీ వ‌ద్ద‌కు వ‌చ్చి చూస్తే అస‌లు కంపెనీనే ఎత్తేయ‌డంతో ఖంగుతున్నారు. త‌మ‌కు మోసం చేసిన‌వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి అంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Next Story