- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోండి: డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం లేఖ
పార్లమెంట్‌లో ఆంధ్రా - తెలంగాణ విభజనను భారత్- పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్‌లో ఆంధ్రా - తెలంగాణ విభజనను భారత్- పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఒక ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగిందన్నారు. దీనిని భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ యొక్క పవిత్రతను తగ్గించడమే కాక, తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్లు అవుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రకటనలు ప్రజల్లో సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక, రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందన్న మంత్రి పొన్నం తెలిపారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజల్లో శాంతి, సామరస్యాలను కాపాడటానికి, ఈ విషయాన్ని పరిశీలించి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.






