- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం... ప్రభుత్వం తరపున కేసీఆర్‌కు ఆహ్వానం
మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలవనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆసక్తికర సన్నివేశం కనిపించబోతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)పై విమర్శలు కురిపించే కాంగ్రెస్ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అధికారిక కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించబోతున్నారు. ఇందుకు ఎర్రవల్లి ఫాంహౌస్(Erravalli Farmhouse) వేదిక కాబోతోంది.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్కే భవన్(BRK Bhavan)లో ఈ నెల 9న ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయన వద్దకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పంపుతోంది. మరికాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) .. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని స్వయంగా ఆహ్వానించనున్నారు. కేసీఆర్ ను కలిసిన తర్వాత తిరిగి పయనం కానున్నారు.






