రేపు కేసీఆర్‌ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. కారణమిదే!

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు.

రేపు కేసీఆర్‌ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. కారణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. శనివారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌(Erravelli Farmhouse)కు వెళ్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎంవో కేసీఆర్ అపాయింట్మెంట్ కోరింది. కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్‌(Bandi Sanjay)లకు కూడా పొన్నం ప్రభాకర్ ఆహ్వానాలు అందించనున్నారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ తల్లి రూపంపై సస్పెన్స్‌ వీడింది. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్‌, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న.. వరి సజ్జలు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. ఈ నమూనాను శుక్రవారం విడుదల చేశారు.

Next Story