తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-15 05:15:29  IST  )

వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు టీచర్లు క్లాస్ రూమ్లను ఎంతో అందంగా అలంకరించారు.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు టీచర్లు క్లాస్ రూమ్లను ఎంతో అందంగా అలంకరించారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు.. టీచర్లు పూలతో స్వాగతం పలికారు. ఉదయం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. 1269 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్.. రాజ్ భవన్ బడిలో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రేక్ ఫాస్ట్ పథకంతో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలని పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరం ప్రయత్నించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో అర్హత ఉన్న సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా టీచర్లు, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.

Next Story