- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే తరానికి మంచి జీవితం కోసం జీవో 41 పాలసీ : మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
ఈవీ పాలసీ ద్వారా రాబోయే తరానికి మంచి జీవితం ఉండడానికి జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని, లక్ష వాహనాలు ఈ సంవత్సర కాలంలో అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈవీ పాలసీ ద్వారా రాబోయే తరానికి మంచి జీవితం ఉండడానికి జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని, లక్ష వాహనాలు ఈ సంవత్సర కాలంలో అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దానం నాగేందర్, ఆది శ్రీనివాస్, పాయం వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ గతంలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కీమీ కెపాసిటీ ఉన్న వాహనాలు ఇప్పుడు 500 కీమీ వచ్చే కెపాసిటీ వచ్చింది. దానిని మరింత పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, చార్జింగ్ స్టేషన్ లను పెంచడానికి కార్యాలయాలు, గ్రేటర్ కమ్యూనిటీ హాల్ లు,విద్యాలయాల వద్ద కూడా ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టామని, ఈవీ పాలసీ కోసం ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వం నుండి దాదాపు రూ. 900 కోట్ల నష్టం జరిగినప్పటికీ పాలసీ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొంటే 20 శాతం మినహాయింపు ఇవ్వడం జరిగింది, దీంతో గణనీయంగా పెరిగాయని 0.3 శాతం నుంచి ఇప్పుడు 2 శాతం వరకు గణనీయంగా పెరిగినట్లు తెలిపారు.
హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి రావొద్దు!
ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ,పాఠశాల బస్సులు, ఫార్మా ,ఐటీ వాహనాలు 25 నుంచి 50 శాతం వారి అవసరాలను బట్టి ఈవీ వాహనాలు కొనేలా విధానం తీసుకురాబోతున్నామన్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే అక్కడ గాలిలో డేంజరస్ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుస్తుందని, రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ వ్యవస్థ ఉన్న కాలుష్యం నుండి కాపాడుకోలేక పోతున్నామన్నారు. హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఈవీ పాలసీ ద్వారా ఈవీ వాహనాలు, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాల వినియోగం పెంచుతున్నామని చెప్పారు. హైదరాబాద్ కు పీఎం ఈ -డ్రైవ్ కింద 2800 బస్సులు దశల వారీగా వస్తున్నాయని, వరంగల్ మున్సిపాలిటీ 100, నిజామాబాద్ మున్సిపాలిటీ 50 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని పేర్కొన్నారు. మనం వాడే వాహనాలు కూడా ఈవీ వాహనాలు వాడేలా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20 నుంచి 30 శాతం ఈవీ వాహనాలు వాడేలా కార్యాచరణ తీసుకుంటుందని,15 సంవత్సరాల పైబడిన వాహనాలు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని, వాహనాలు ఇచ్చిన వారికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.
ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు
ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో రెట్టిరోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని, ఆటో లు కూడా డీజిల్ వాహనాలు కనిపించకుండా రెట్టిరోఫిట్ కి అవకాశం ఇచ్చామన్నారు. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుతం 200 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటుతుందని ఢిల్లీ 400 ఎప్పడో దాటిందన్నారు.కాలుష్య నివారణకు ప్లాంటేషన్ పెంచడంతో పాటు ఈవీ వాహనాలు వినియోగం పెంచాలని పేర్కొన్నారు. ఈవీ వాహనాల వినియోగం దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని సూచించారు.రాబోయే తరానికి కాలుష్యరహిత తెలంగాణ అందించాలన్నారు. కార్మిక సంఘాల రద్దు పై పాలసీ పై త్వరలోనే మార్గదర్శకత్వం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణంలో ఆర్టీసీ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్లకు సత్కరించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 58 అగ్నిమాపక కేంద్రాలకు ప్రతిపాదనలు వచ్చాయని, పెరుగుతున్న 18 అంతస్తులు ,104 అంతస్తుల బిల్డింగ్ కు సంబంధించి మిషనరీ ప్రాసెస్ లో ఉన్నాయని, గేటెడ్ కమ్యూనిటీ, ఆసుపత్రులు పరిశ్రమలు, విద్యాలయాలు ఫైర్ సేఫ్టీపై 13658 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఫైర్ సేఫ్టీ సిబ్బంది నియామకాలు
ఫైర్ సేఫ్టీ సిబ్బంది నియామకాలు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేకుండా తీసుకుంటున్న వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కాలుష్య పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయానికి అనుసంధానం చేశామన్నారు. రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలు ఉంటే 550 పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశామని, 15 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొరపాటు ఇవ్వలేకుండా మాన్యువల్ గా ఇచ్చేలా టెక్నాలజీ ఉందని, ఇక్కడ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కూల్ బస్సులు, ఐటీ, ఫార్మా కంపెనీల వాహనాలు కూడా పొల్యూషన్ కి కారణమైతే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






