Ponnam Prabhakar: హైదరాబాద్‌లో మరో అత్యాధునిక బస్టాండ్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్టాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Ponnam Prabhakar: హైదరాబాద్‌లో మరో అత్యాధునిక బస్టాండ్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్టాండ్ (New bus stand) అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆరాంఘర్‌లో అత్యాధునిక బస్టాండ్‌ను నిర్మించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోందని మంత్రి పొన్నం తెలిపారు. నాటి అవసరాల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బస్టాండ్‌లను నిర్మించారని వివరించారు. ఇప్పుడు ఎయిర్‌పోర్టు, మహబూబ్‌నగర్ ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ఆరంఘర్ వద్ద ఒక స్థలం ఉందని దాంట్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మించేందుకు ఆలోచన ఉందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా ఫోర్త్ సిటీకి అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ఆర్టీసీ డిపోలు, బస్టాప్‌ల కోసం స్థలం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. నగరం విస్తరిస్తున్న కారణంగా బస్టాప్‌లకు స్థలాలు దోరకడం ఇబ్బందులు ఎదురవుతాయని, మరోవైపు బస్సుల సంఖ్య పెరిగిందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల డిమాండ్ మరింత పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో పలు విధానాలు తీసుకొస్తున్నట్లు వివరించారు. ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా రాబోయే కాలంలో మోడ్రన్ లుక్, మోడ్రన్ ఫెసిలిటీస్‌తో బస్టాండ్లు నిర్మిస్తామన్నారు.

Next Story