వాళ్లకు శిక్ష తప్పదు: మంత్రి పొన్నం వార్నింగ్

by Vemula.Srinu Prasad |

తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ....

వాళ్లకు  శిక్ష తప్పదు:  మంత్రి పొన్నం వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష పార్టీల నేతలు సొంత కుటుంబాల్లో అల్లుడు ఏం మాట్లాడుతున్నారో వినడానికి ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి నెలకొందని పొన్నం మండిపడ్డారు. 10 ఏళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్‌ను బీఆర్ఎస్ పార్టీ ఆయుధంగా మలుచుకుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, జర్నలిస్టు లు , రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిరంతర నిఘా పెట్టిందని చెప్పారు.

‘‘తమ అధికారానికి అక్రమాలకు అడ్డగా హైకోర్టు జడ్జిలు , ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఫోన్లు విని దొంగదారిన గెలిచే ప్రయత్నం చేశారు. సీఎం అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చి ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేయడం సాధ్యం అవుతుందా...?. బిఆర్ఎస్ ఓడిపోయింది కనుకనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ధ్వంసం చేశారు. కక్ష సాధింపులకు నోటీసులు అనడానికి సిగ్గు ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఏ స్థాయి వ్యక్తులనైనా పోలీసులు విచారణ చేస్తారు. తప్పు చేసినప్పుడు శిక్షలు తప్పవు. కేసీఆర్‌ను విచారణకి పిలిస్తే ధర్నాలు చేస్తాం, బంద్‌లు చేస్తామని పిలుపునిచ్చి పాల్గొంటున్న అనేక మంది నేతల ఫోన్‌లు ట్యాపింగ్ చేసి ఉంటారు. ఒకరి నియంతృత్వం వద్దని కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఎక్కడైతే దేశ ద్రోహులు , ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తులు దేశానికి ఏం ముప్పు చేస్తారో అనే నిఘా వేసే టెలిగ్రాఫ్ చట్టం. రాష్ట్రంలో మేధావులు , విద్యావంతులు ,రాజకీయ నాయకులతో పాటు సొంత అల్లుడు ఫోన్‌లు ట్యాపింగ్ చేసి విన్నారు. ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.’’ అని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని మీరు చెప్తున్న విధానాలు తప్పు.. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అధికారులను , ప్రతిపక్ష పార్టీ నేతలను సొంత కుటుంబ సభ్యులను వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తారా..?. అధికారం కోల్పోయారు..పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ,మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడించారు..ఎమ్మెల్సీ ఓడించారు..సర్పంచ్ ఎన్నికల్లో 30 శాతం పలితాలు కూడా దక్కలేదు ఓడించారు. చేసిన పాపాలు ముక్కు నేలకు రాసి ఒప్పుకోవాలి తెలంగాణ ప్రజలకు క్షమణాలు చెప్పాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో సానుభూతి చూసుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి ర్యాలీలు ధర్నాలకు భయపడితే చట్టం ఉండదు.. విచారణలో తన పని తను చేసుకుపోతుంది. 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం..నేరపూరిత విధ్వంసం నియంతృత్వంగా వ్యవహరించడం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలించడం చేశారు. తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి తీర్పు ఇచ్చారో ఇపుడు యావత్ పట్టణ ప్రాంత ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తీర్పు ఇస్తారు.’’ అని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

Next Story