Minister Ponnam : ప్రియాంక గాంధీని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని మర్యాద పూర్వకంగా కలిశారు.

Minister Ponnam : ప్రియాంక గాంధీని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని మర్యాద పూర్వకంగా కలిశారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ, కులగణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారని పొన్నం వెల్లడించారు.

అంతకుముందు వయనాడ్‌ ఉప ఎన్నికలో 4లక్షల 3వేల 966 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన ఏఐసీసీ (ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమర్క మర్యాదపూర్వకంగా ఆమెను స్వయంగా కలిసి అభినందించారు.

Next Story