కౌశిక్ రెడ్డి వ్యవహారంపై KCR స్పందించాలి.. మంత్రి పొన్నం డిమాండ్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సీరియస్ అయ్యారు.

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై KCR స్పందించాలి.. మంత్రి పొన్నం డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సీరియస్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో కౌశిక్ రెడ్డి చేసిన హంగామాపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రోత్సాహిస్తారో లేక కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తారో మీ ఇష్టం అని అన్నారు. కానీ ఇలాంటి ఘటనల పట్ల బీఆర్ఎస్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలని తెలిపారు. పరుష పదాలు నేర్పే పాఠశాలలను బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుందా? అని అడిగారు. ఇవాళ్టి ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీల మార్పుపై జీవితాంతం ఒకే పార్టీలో ఉన్న వాళ్లు మాట్లాడితే బావుంటుందని అన్నారు. పార్టీలు మారిన వాళ్లు కూడా ఇతరులను ప్రశ్నించడం చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాళ్లు రువ్విన వాళ్లు కూడా నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.

Next Story