అలర్ట్‌గా ఉండండి.. GHMC అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

by Gantepaka Srikanth |

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌(Hyderabad)లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.

అలర్ట్‌గా ఉండండి.. GHMC అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌(Hyderabad)లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టి టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు.

ప్రధాన రోడ్ల పై వరద ప్రభావం వల్ల రోడ్ల పై ట్రాఫిక్ ఏర్పడిందని అరగంట లోపు వాటర్ క్లియర్ చేస్తామని అధికారులు తెలిపారు. డ్రైనేజీ పొంగిపొర్లకుండా hmwssb జెట్టింగ్ మిషన్స్ ద్వారా అరికడుతున్నాయి. పోలీస్(HYD Police, జీహెచ్ఎంసీ(GHMC), వాటర్ బోర్డు, విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

Next Story