- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
by Satheesh |
ప్రధాని మోడీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రచారం చేశారని మండిపడ్డారు. బీజేపీ హయాంలో దేశంలో పదేళ్లు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో మాకు 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని.. జూన్ 4న వెలువడే ఫలితాల్లో రిజల్ట్స్ మరోలా ఉంటాయని అన్నారు.
Next Story






