- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు స్థానికత్వం కల్పించాలి : మంత్రి పొన్నం
ఈ విద్యా సంవత్సరం ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటా కంటిన్యూ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ విద్యా సంవత్సరం (AP Sainik School) ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటా కంటిన్యూ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఏపీలో తెలంగాణ పిల్లలకు స్థానికత కల్పించాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం, ఏపీ సర్కార్ నిర్ణయంతో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాసిన 20వేలకు పైగా విద్యార్థులు అయోమయంలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయని, తెలంగాణలో కూడా తొందరగా సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్‌రెడ్డి (Kishan Reddy) జోక్యం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కాగా, ఏపీలో గత పదేళ్లుగా 67 శాతం తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటాను ఇచ్చేది. అయితే ఈ ఏడాది ఏపీ సైనిక్ స్కూల్స్‌లో 67 శాతం లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉత్తర్వులు వచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంపై ఇటీవల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సైతం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ (Sanjay Seth)ను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి మూడు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ సైనిక్ స్కూల్స్‌లో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థుల కోటాను కొనసాగించాలని విజ్ఞప్తి పత్రాన్ని అందించారు.






