- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం తీన్మార్ డ్యాన్స్
తెలంగాణలో ఆషాఢమాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. నేడు ఆషాఢ మాసం తొలి బోనం ఉత్సవం జరగ్గా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా ఇతర నేతలు లంగర్ హౌజ్ చౌరస్తా లో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆషాఢమాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. నేడు ఆషాఢ మాసం తొలి బోనం ఉత్సవం జరగ్గా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా ఇతర నేతలు లంగర్ హౌజ్ చౌరస్తా లో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున తొలి బోనం సమర్పించారు. ఈ ఉత్సవంలో బంగారు బోనం సమర్పించిన తర్వాత పోతురాజులతో కలిసి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ అనిల్ కుమార్ తీన్మార్ డ్యాన్స్ చేశారు. నేతలు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బోనాల పండుగ నిర్వహణ కోసం రూ.20 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల కోసం మొత్తం 2783 ఆలయాలకు చెక్కుల రూపంలో నిధులు జారీ చేశారు. దీంతో ఆలయాల్లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.






