Ponnam: ఆ భయంతోనే బీజేపీ మమ్మల్నీ రాష్ట్రపతిని కలవనివ్వడం లేదు: పొన్నం ప్రభాకర్

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్ల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponnam: ఆ భయంతోనే బీజేపీ మమ్మల్నీ రాష్ట్రపతిని కలవనివ్వడం లేదు: పొన్నం ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్పినట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీజేపీకి భయం పట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. అందుకే మేము అపాయింట్మెంట్ కోరి 10 రోజులు అవుతున్నా రాష్ట్రపతిని కలవనివ్వ లేదని ఆరోపించారు. ఇవాళ జాతీయ మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. రాష్ట్ర ముఖ్యమంత్రి, కెబినెట్ మెంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీలో ఎదురు చూసినా రాష్ట్రపతి ఎందుకు అపాయింట్ మెట్ ఇవ్వలేరన్నారు. ఇకనైనా ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను (BC Reservation Bill) అడ్డుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి మానుకోవాలన్నారు. ముందు కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లును చదవాలన్నారు. మేము మత ప్రాతిపదికన ఎక్కడ రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు.

బీజేపీ డబుల్ స్టాండర్డ్:

తెలంగాణ బీజేపీకి ఇప్పుడు బీసీ బద్ధ వ్యతిరేకి రామచందర్ రావు అధ్యక్షుడు అయ్యారు. కానీ అంతకు ముందు కిషన్ రెడ్డే రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడుగా ఉన్నారని ఆయన హాయంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లులకు బీజేపీ మద్దుతు ఇచ్చి ఇప్పుడు ఢిల్లీలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇది బీజేపీ డబుల్ స్టాండర్డ్ కు నిదర్శనం అన్నారు. బీసీలకు మేలు చేయాలని చూసినప్పుడల్లా అడ్డుపడటం బీజేపీకి పరిపాటిగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. మండల్ కమిషన్ తీసుకువస్తే కమండల్ పేరుతో ఆపారని, సెంట్రల్ యూనివర్సిటీల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సోనియా గాంధీ గతంలో ప్రయత్నిస్తే యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Next Story