- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam: వెళ్లి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి.. బీజేపీ నేతలపై మంత్రి పొన్నం విమర్శలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై స్టేట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ నేతల ఆందోళనపై హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలు కార్పొరేటర్లు ధర్నా చేయాల్సింది జీహెచ్ఎంసీ (GHMC) ఆఫీస్ ముందు కాదని కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేకుండా కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ అభివృద్ధిలో రాజకీయాలు వద్దని కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డిపై బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు.
కాగా హైదరాబాద్ నగర సమస్యలపై ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ (BJP) కార్పొరేటర్లు, పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా భారీగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలువురు బీజేపీ కార్యకర్తలు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.






