- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా ఒక్కడిదే కాదు.. ప్రభుత్వ లక్ష్యం కూడా అదే’: మహిళా డ్రైవర్ సరితకు మంత్రి పొన్నం విషెస్
తెలంగాణలో ఆర్టీసీ(Telangana RTC)లో తొలి మహిళా డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండాకు చెందిన వి.సరిత శనివారం విధుల్లో చేరారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆర్టీసీ(Telangana RTC)లో తొలి మహిళా డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండాకు చెందిన వి.సరిత శనివారం విధుల్లో చేరారు. మొట్టమొదటగా హైదరాబాద్ టూ మిర్యాలగూడ వరకు బస్సు నడిపారు. గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో పదేళ్లుగా ఆమె డ్రైవర్‌గా విధులు నిర్వహించారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో నియమించారు.
తనకు అవకాశం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కి మహిళా డ్రైవర్ సరిత(Saritha) ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు, తాజాగా ఆర్టీసీలో మహిళా డ్రైవర్‌గా అవకాశం ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ వి.సరిత ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.






