కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బాలున్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

by Muthe.Rajitha |

కిలిమంజారో పర్వతాన్ని 8 ఏళ్ల జాటోత్ విహాన్ రామ్ అధిరోహించాడు.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బాలున్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కిలిమంజారో పర్వతాన్ని 8 ఏళ్ల జాటోత్ విహాన్ రామ్ అధిరోహించాడు. ఈమేరకు జాటోత్ విహాన్ రామ్ సోమవారం బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది. సిద్దిపేట జిల్లా హనుమ తండాకు చెందిన విహాన్ రామ్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. విహాన్ రామ్ మరిన్ని అంతర్జాతీయ పర్వతాలను అధిరోహించి రాష్టానికి తద్వారా దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.

Next Story