రేపు గవర్నర్ దగ్గరికి వెళ్తాం.. నిర్ణయం ఆయన ఇష్టం : మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

by Ramesh Naini |

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల బిల్లులు రాష్టపతి ఆమోదం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రేపు గవర్నర్ దగ్గరికి వెళ్తాం.. నిర్ణయం ఆయన ఇష్టం : మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల్లో (BC Reservations) బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల బిల్లులు రాష్టపతి ఆమోదం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. రేపు గవర్నర్ (Governor) దగ్గరికి వెళ్తాం.. అన్ని పార్టీల నుండి ప్రతినిధులం వెళ్లి గవర్నర్‌ను కలుస్తామని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ అడుగుతున్నాం.. కానీ ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తామని అన్నారు. మా విధానం మేం చెప్తాం.. నిర్ణయం గవర్నర్ ఇష్టం అని హాట్ కామెంట్స్ చేశారు.

న్యాయ పరంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. సభలో అందరికి ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు. నేను లా చదివాను.. ప్రాక్టీస్ చేయలేదు. నేను మధ్యలో చదువు ఆపలేదు.. విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే ఈ సమస్యపై అవగాహన ఉందన్నారు. నాకేం అవగాహన లేకుండా మాట్లాడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఫైనల్ కదా.. మూడ్ ఆఫ్ ది హౌజ్‌ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Next Story