- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా తెప్పించాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదే: మంత్రి పొన్నం
యూరియా తయారీ మన రాష్ట్రంలో జరగదు అని పూర్తిగా 100 శాతం సరఫరా ప్రక్రియ కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాబట్టి భవిష్యత్తులో వచ్చే వ్యవసాయ సీజన్ లో రైతులు యూరియా కోసం ఇబ్బందిపడే పరిస్థితి వస్తే ఊరుకోం అని హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: యూరియా తయారీ మన రాష్ట్రంలో జరగదు అని పూర్తిగా 100 శాతం సరఫరా ప్రక్రియ కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాబట్టి భవిష్యత్తులో వచ్చే వ్యవసాయ సీజన్ లో రైతులు యూరియా కోసం ఇబ్బందిపడే పరిస్థితి వస్తే ఊరుకోం అని హెచ్చరించారు. దీనిపై ఇప్పటి నుండే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. మన రాష్ట్ర అవసరాలకు ఎంత యూరియా కావాలో అంత డిమాండ్ ను తాము వ్యవసాయ శాఖ తరపున లిఖితపూర్వకంగా పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు అందజేస్తామని అన్నారు. కేంద్రం నుండి దాన్ని తెప్పించాల్సిన పూర్తి బాధ్యత బీజేపీ నాయకులదే అని స్పష్టం చేశారు.
యూరియా సప్లై విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా అది తెలంగాణ రైతాంగానికి తీవ్రనష్టం కలిగిస్తుందని, అప్పుడు ఎక్కడికక్కడ బీజేపీ నాయకత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఇక గత పంట సమయంలోనూ యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. యూరియా కోసం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. దీంతో కొనుగోలు కేంద్రాల క్యూ లైన్లు దర్శనం ఇచ్చాయి. ఒక్క బస్తా అయినా ఇప్పించండి అంటూ రైతులు అధికారుల కాళ్లు పట్టుకుంటున్న వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ముందు నుండే మంత్రులు యూరియా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.






