- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళాకారులను ప్రోత్సహించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కళాకారులను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని బీ.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

X
దిశ, మిర్యాలగూడ టౌన్ : కళాకారులను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని బీ.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో వేములపల్లి మండలం మఁగాపురం గ్రామానికి చెందిన తెలంగాణ కవి ,రచయిత జెరిపోతుల రవి గౌడ్ రచించిన 'నా తెలంగాణ కోటి రతనాల వీణ ' వీడియో పాటను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందని అన్నారు. తెలంగాణలో కళాకారులు తమ ప్రతిభ ను ప్రతి ఒకరూ ఆదరించాలని అన్నారు. తెలంగాణ కవులు రచించిన రచనలు ప్రజలను మేల్కోపు కలిగించే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు దొరబాబు(మేరేడ్ధి పృథ్వీ కుమార్ రెడ్డి ) హరీష్ గౌడ్ ,నరేందర్ గౌడ్ ,నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా తెప్పించాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదే: మంత్రి పొన్నం
Next Story






