- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ అభివృద్ధికి... బీఆర్ఎస్ అబద్దాలకు మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు...ఎన్నిక కాంగ్రెస్ అభివృద్ధికి... బీఆర్ఎస్ అబద్దాలకు మధ్య జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీకు అభివృద్ధి కావాలా.. అబద్ధాలు కావాలా... తెలుసుకోవాలి..ప్రయాణించే బండి ఎక్కాలి...కానీ మూలకువడ్డ కారు ఎక్కితే మీరు ముందుకు పోలేరు.. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు...ఎన్నిక కాంగ్రెస్ అభివృద్ధికి... బీఆర్ఎస్ అబద్దాలకు మధ్య జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీకు అభివృద్ధి కావాలా.. అబద్ధాలు కావాలా... తెలుసుకోవాలి..ప్రయాణించే బండి ఎక్కాలి...కానీ మూలకువడ్డ కారు ఎక్కితే మీరు ముందుకు పోలేరు.. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, బీఆర్ఎస్ కేంద్రంలో లేదు.. రాష్ట్రంలో లేదు.. ఆ పార్టీకి ఓటేస్తే ఉపయోగం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ విద్యావంతుడు నిత్యం ప్రజల్లో ఉండే నవీన్ యాదవ్ ను రౌడీ అంటున్నారు.. వాళ్ళు ఎన్ని అన్న అవి మా ఆశీర్వాదాలు.. బలహీన వర్గాల అభ్యర్థి నవీన్ యాదవ్ కు భవిషత్ లో కూడా మద్దతుగా ఉంటాం..ఇప్పుడు ఆటో లో ప్రయాణం చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నారు..2012 తరువాత నగరంలో ఒక్క ఆటోకి పర్మిట్ ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్తెలిపారు. అప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చినవి తప్ప మళ్ళీ ఇవ్వలేదని, తాము 20 వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చామన్నారు.
పదివేల సీఎన్జీ, పదివేల ఎల్పీజీ అటోలకు అనుమతి ఇచ్చాని, ఇప్పుడు ఆటో వాళ్లు కొత్తగా కొనుక్కొని ఉపాధి పొందుతున్నారని పొన్న ప్రభాకర్ వివరించారు. తమ ఎన్నికల హామీ మేరకు ఆటోలకు 12 వేల ఇచ్చే అంశంపైన చిత్తశుద్ధి ఉందని, అమలు చేస్తామని, బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం చేయడం వల్లే ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యం అయిందన్నారు. బీఆర్ఎస్ నేతలు కవిత అడుగుతున్న ప్రశ్నలకు జవాబు లు చెప్పి ఓట్లు అడగాలని, బీఆర్ఎస్ పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి చెప్పకుండా.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఓటు చోరీ అంశాన్ని లేవనెత్తింది తమ అగ్రనేత రాహుల్ గాంధీ అని, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఓటు చోరీ పై మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ఈ నియోజకవర్గంపై నిరక్ష్యం చేశారన్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న కేంద్ర మంత్రి పదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని, రామచంద్రరావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా లేక యూసుఫ్ గూడా డివిజన్ అధ్యక్షుడా అని ఆయన ప్రశ్నించారు. పుట్టే బిడ్డకు కూడా 2 లక్షల రూపాయలు అప్పు మీరు చేసి పెట్టారనిర, జూబ్లీహిల్స్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం పై మేము మాట్లాడుతున్నామని, పదేళ్లలో మీరు చేయని అభివృద్ధి రెండు నెలల్లో మేము చేసి చూపించామని మంత్రి పొన్నం తెలిపారు.
కిషన్ రెడ్డి 12 ఏళ్లలో, బీఆర్ఎస్ పదేళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఏం చేశారో యూసుఫ్ గూడాలో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ విధానాలు చెప్పే బాధ్యత అప్పగించారని, నాయకుల్లో అండర్ స్టాండింగ్ ఉందని వారి శాసన సభ్యులు రాజా సింగ్ చెప్తున్నారని పొన్నం చెప్పారు. తెలంగాణ అక్కా చెల్లలకు ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ వ్యతిరేకించడాన్ని సమస్త మహిళా లోకం ఖండించాలని, మహిళా ఉచిత బస్సు ప్రయాణంపై కవిత ఎందుకు ఖండించడం లేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. భారీ వర్షంలోనూ సీఎం రేవంత్రెడ్డి సినీ కార్మికులు సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ నూతనంగా రేషన్ కార్డులు పంపిణీ చేశామని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 లక్షల 40 వేల మందికి పైగా ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందుతున్నాయని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం..500 కి గ్యాస్ అందిస్తున్నాం..మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నాం.. 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం..ప్రభుత్వం ఎన్నో పథకాలు సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్వివరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






