- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మార్చిలోగా లక్ష ఉద్యోగాలు
తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంతో పాటు పలు అంశాలపై చర్చించి, అమలుపై సమీక్షించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంతో పాటు పలు అంశాలపై చర్చించి, అమలుపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ వినిపించారు. జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు. 17వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నారు. మార్చిలోగా లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించామని చెప్పారు. తెలంగాణను తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని అన్నారు. కానీ గత ప్రభుత్వం నోటీసులకే పరిమితమైందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత ఇప్పటి వరకు 60వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. క్యాటగిరేషన్ సంబంధించిన ఇష్యూ ఉండటం వల్ల జాబ్ క్యాలెండర్ ఆలస్యం అయ్యిందన్నారు.






