- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి వర్గ విస్తరణపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులగణన చేస్తే ఏం వస్తుంది అని అడిగేవారికి మంత్రి వర్గ విస్తరణే సమాధానం అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులగణన చేస్తే ఏం వస్తుంది అని అడిగేవారికి మంత్రి వర్గ విస్తరణే సమాధానం అని చెప్పారు. రాహుల్ గాంధీ సమాజిక న్యాయం కోసమే కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకు ఇవ్వడం ద్వారా న్యాయం చేస్తే తిరిగి మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఖర్గే మరియు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తే ఏం జరుగుతుంతో దేశానికి తెలియజేశారన్నారు. తెలంగాణ కులగణనలో దేశానికి రోల్ మోడల్ అని కొనియాడారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కులగణన దేశాన్ని తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో కులగణన చేపట్టగా కేంద్రంలోని బీజేపీ త్వరలో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించింది.






