- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు
ఇక నుంచి రాష్ట్రంలో కొత్తగా రిజిష్టర్ అయ్యే వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్ విధించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇక నుంచి రాష్ట్రంలో కొత్తగా రిజిష్టర్ అయ్యే వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్ విధించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ మోటార్ వెహికిల్స్ టాక్సేషన్ బిల్లు 2025ని ప్రవేశపెట్టి మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు రూ.2వేలు, లైట్ మోటార్ వాహనాలకు రూ.5 వేలు, పెద్ద వాహనాలకు రూ.10 వేలు రోడ్ సేఫ్టీ సెస్ విధించనున్నట్లు చెప్పారు. 4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసిక టాక్స్ ఉండేదని.. రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్‌కు సంబంధించిన వాహనాలపై లైఫ్ టాక్స్ విధిస్తూ 7.5 శాతానికి చేయడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే.. జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని.. అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తాం
తాము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అఫిడవిట్ తీసుకురావాలని.. ఇందులో విద్యా, సంక్షేమ శాఖ పాఠశాలలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రతి పౌరునికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. యూనిసెఫ్ సహకారంతో స్కూళ్లలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే.. కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. ఎవరికి వారు స్వయంగా వాహనాల ఫిట్నెస్ చూసుకోవాలని.. రోడ్డు నిబంధనలు పాటించాలని అన్నారు. బ్లాక్ స్పాట్‌లను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అతి వేగానికి స్పీడ్ కట్టడికి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగి కాలుష్యాన్ని అరికడుతున్నామన్నారు. త్వరలో ఢిల్లీ మాదిరి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపారు.






