- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. మంత్రి పొన్నం ఏరియల్ సర్వే
ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న గణనాథుల నిమజ్జనోత్సవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.

దిశ, వెబ్‌డెస్క్:హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ (Tank bund) సహా పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం (Ganesh Nimajjanam 2025) ప్రశాంతంగా జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రెండు లక్షల 32 వేల 520 విగ్రహాల నిమజ్జనం జరగ్గా.. మిగతా విగ్రహాలు నిమజ్జనానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ (Hussain Sagar) వద్ద గణనాథుల నిమజ్జనాలను పరిశీలించేందుకు మంత్రిపొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కలెక్టర్ హరిచందన హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే (Aerial Survey) నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది కలిసి నిమజ్జనాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. శనివారం అర్థరాత్రి 12 గంటల్లోగా నిమజ్జనాలు పూర్తవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. గతంలో నిమజ్జనాలకు 3 రోజుల సమయం పట్టేదని, ఇప్పుడు ఒకరోజులో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర (Balapur Ganesh Shobhayatra) తెలుగుతల్లి ఫ్లై ఓవర్ (Telugutalli Flyover)కు చేరుకోగా.. మరికొద్దిసేపటిలో క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం జరగనుంది.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు. క్రేన్ నంబర్ 4 వద్ద కలెక్టర్ హరిచనందన, పోలీసులతో మాట్లాడి నిమజ్జన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఏ సీఎం ఇలా నిమజ్జన ఏర్పాట్లను చూసేందుకు రాలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. సీఎంను చూసిన ప్రజలు.. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పెద్దగా కాన్వాయ్ లేకుండా.. రెండు వెహికల్స్ లో సామాన్యుడిలా వచ్చిన సీఎంను చూసి.. ప్రజల సీఎం అంటూ కొనియాడుతున్నారు.






