- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లి మల్లన్న సేవలో మంత్రి పొన్నం.. ప్రతిపక్షాల మాటలకు స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు మొదలయ్యాయని, ప్రతిపక్షాలు (Oppositions) ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు మొదలయ్యాయని, ప్రతిపక్షాలు (Oppositions) ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallana) దర్శనం చేసుకున్న ఆయన.. దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సహకరించి మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మల్లన్నను వేడుకున్నానని చెప్పారు. అంతేగాక ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నదని చెప్పారు.
గ్రామాల్లో తాగు నీటిని ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారం కాకపోతే స్థానిక ఎమ్మెల్యే ,మంత్రి దృష్టికి తీసుకురండి అని సూచించారు. అంతేగాక యంగ్ ఇండియా స్పోర్ట్స్ (Young India Sports), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీలు (Young India Skill University) ఏర్పాటు చేస్తున్నామని, పెట్టుబడులు తీసుకొస్తున్నామని, ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక ప్రతిపక్షాలు విమర్శలకు చెక్ పెడుతూ.. ఆర్టీసీ లో మొన్ననే డిఏ ఇచ్చామని, కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు శాసన సభలో చట్టబద్ధం చేస్తామని, తరువాత ఢిల్లీ వెళ్లి మద్దతు కోరుతామని చెప్పారు. బీసీ కుల గణనలో స్వచ్ఛందంగా సమాచార సేకరణ జరిగిందని, సమాచారం ఇవ్వని వారికి మరోసారి అవకాశం ఇచ్చామని తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని, దీని కోసం అందరి సహకారం కోరుతున్నామని అన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన నెల నుండే విమర్శలు చేస్తూ బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం అభ్యర్ధిని పెట్టలేదని, వాళ్ళు గెలిచినది చెల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లేనని విమర్శలు చేశారు. రంజాన్ గిఫ్ట్ అంటున్న వారికి అవగాహన ఉండాలని, మాకు ఓట్లు వేసిన వారంతా పాకిస్థాన్ వాళ్ళ అని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ గెలిపించి గిఫ్ట్ ఇస్తే ములుగు నుండి మంచిర్యాల వరకు 8 లైన్ల రోడ్డు వేయిస్తా అని చెప్పారని, అలాగే కరీంనగర్ నుండి తిరుపతి వెల్లే రైలు ప్రతి రోజు నడిచేలా చేయిస్తానన్నారు. ఇవన్నీ వెంటనే చేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి తిరుపతికి రెగ్యూలర్ గా రైలు నడిపించే విషయంపై నిన్న కూడా రైల్వే మంత్రికి మరోసారి లేఖ రాశానని తెలిపారు. మొత్తం లక్షా 80 వేల కోట్ల కాంట్రాక్టులకు అనుమతులు తెచ్చుకున్నామని, ప్రభుత్వానికి అందరూ సహకరిస్తే అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు.






