Minister Ponnam: ప్రజాస్వామ్యంలో ఇది మర్చిపోయారా.. బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం సెటైర్లు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్న నాడు శాసన మండలి చైర్మన్‌ (Chairman of the Legislative Council)పై కాగితాలు పడేశారని తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని గులాబీ పార్టీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సెటైర్లు వేశారు.

Minister Ponnam: ప్రజాస్వామ్యంలో ఇది మర్చిపోయారా.. బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్న నాడు శాసన మండలి చైర్మన్‌ (Chairman of the Legislative Council)పై కాగితాలు పడేశారని తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని గులాబీ పార్టీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట సభల్లో ప్రజాస్వామ్యానికి నాయకుడు ముఖ్యమంత్రి (CM) అయితే, సభకు అధిపతి స్పీకర్ (Speaker) అని అన్నారు. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌ను పట్టుకుని ‘సభ మీ ఒక్కడిదే కాదు’ అని కామెంట్ చేయడం సభా హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jadish Reddy) మాట్లాడింది తప్పని బీఆర్ఎస్ (BRS) అధినాయకత్వం చెప్పకపోవడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వాళ్లే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికం అంటూ అసెంబ్లీ (Assembly) అవరణలో నిరసనకు దిగడం హస్యాస్పదమని అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి కనీస జ్ఞానం రావాలని అన్నారు. సభలో ఎలా ఉండాలో.. సభా వేదికపై ఎలా ప్రవర్తించాలో తెలిసి కూడా అలా చేస్తున్నారంటే.. వారిలో ఏదో దుర్భుద్ధి ఉందనేది స్పష్టం అర్థం అవుతోందని విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఉభయ సభలకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయని తెలిపారు. స్పీకర్ ఓ దళిత బిడ్డ కాబట్టే ఆయనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు శాసన మండలి చైర్మన్‌పై కాగితాలు పడేశారని తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని గులాబీ పార్టీపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story